భారతదేశం, జూలై 7 -- ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా, టర్కీ పాకిస్థాన్‌కు సహాయం చేశాయి. దీనికి సంబంధించిన ఆధారాలను ప్రపంచం చూసింది. దీనిపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు. చైనా, టర్కీ నుండి తమకు ఎటువంటి సహాయం రాలేదని వివరించడానికి ప్రయత్నించాడు.​​​​​​​​​

ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు చురుకుగా మద్దతు ఇచ్చిందని, లైవ్ ల్యాబ్ లాగా దాని ఆయుధాలను పరీక్షిస్తోందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ చెప్పారు. తర్వాత అసిమ్ మునీర్ ఈ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంలో టర్కీ కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని భారత సైనిక అధికారి తెలిపారు .

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. 'పాకిస్థాన్‌కు ఏదైనా బయటి దేశం ను...