ఆపరేషన్ మాన్సూన్ థండర్ : అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు - నిందితుల్లో తెలంగాణ యువకుడు!
భారతదేశం, నవంబర్ 24 -- భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) సంయుక్తంగా ఇటీవల గుట్టురట్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాకు నిషేధిత మత్తుమందులను అక్రమంగా రవాణా చేస్తున్న ఈ ముఠాలో అత్యున్నత విద్యావంతులు ఉండటం దర్యాప్తు అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.
పట్టుబడిన ఆరుగురు భారతీయుల్లో బీటెక్, ఎంబీఏ డిగ్రీలు చేసిన వారు ఉండగా, వీరిలో ఒకరు గతంలోనే డ్రగ్స్ కేసులో అమెరికా నుంచి బహిష్కరణకు (డిపోర్ట్) గురైన తెలంగాణ యువకుడు ఉన్నాడు.
నవంబర్ 4 నుంచి 13వ తేదీ మధ్య దేశంలోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు దర్యాప్తు పరిధిని మరింత విస్తరించినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.