భారతదేశం, ఆగస్టు 20 -- న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఉద్దేశించిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు'కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటింగ్‌తో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడిన తర్వాత ఈ బిల్లుకు దిగువ సభలో ఆమోదం లభించింది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే, ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో సభను వాయిదా వేశారు.

కొత్త చట్టం ప్రకారం, ఆన్‌లైన్ మనీ గేమ్‌లకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తారు. అలాగే, ఈ గేమ్‌ల కోసం నిధులను బదిలీ చేయడానికి లేదా సహకరించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అనుమతి ఉండదు. దీని ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో పారదర్శకతను పెంచాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభు...