భారతదేశం, జనవరి 25 -- భూములకు సంబంధించి ప్రతి అంగుళాన్నిడిజిటలైజ్ చేసి, యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ధరణి ద్వారా సృష్టించిన చిక్కుముడులను విప్పుతూ రైతులకు చుట్టంలా ఉండేలా భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చామన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌(ఐడీఓసీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు లైసెన్స్‌లను అందజేశారు మంత్రి.

భూ సర్వే కోసం గతంలోని టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి, సెంటీమీటర్ల తేడాతో ఖచ్చితత్వం వచ్చేలా రోవర్స్ సాంకేతికతను వాడుతున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పటికే 600 రోవర్లను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేట...