Andhrapradesh, ఆగస్టు 28 -- ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఈ కార్డు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న పథకాల సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని ఈ సమావేశంలో చర్చించారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏయే కుటుంబానికి ఏమేం అవసరాలున్నాయోననే అంశాన్ని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం ఇచ్చే స్కీంల వివరాలను పొందుపర్చాలన్నారు. ఆధార్ ...