భారతదేశం, జనవరి 3 -- చాలా కాలం నుంచి ఓ హిట్ కోసం వెయిట్ చేసిన హీరో ఆది సాయి కుమార్ కు ఇప్పుడు డబుల్ డిలైట్. అతని ఆనందం ఇప్పుడు రెట్టింపైంది. ఓ వైపు అతని రీసెంట్ మూవీ శంబాల హిట్ గా నిలిచింది. మరోవైపు ఆది భార్య అరుణ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆది సాయి కుమార్ శనివారం (జనవరి 3) ఇన్ స్టాగ్రామ్ లో ఓ క్యూట్ పోస్ట్ తో పంచుకున్నాడు.

సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య అరుణ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీళ్లకు ఓ కూతురు ఉంది. ఆమె పేరు అయాన. ఇప్పుడు ఆదికి కొడుకు పుట్టాడు. ఈ ఆనందాన్ని క్యూట్ పోస్టుతో పంచుకున్నాడు ఆది. తన బాబు లిటిల్ ఫింగర్స్ తో పాటు ఇది అబ్బాయి చెప్తూ ఫొటోలు పోస్టు చేశాడు.

''మన రెండో బిడ్డకు వెల్ కమ్ చెప్తున్నాం. ఇప్పుడు అబ్బాయి పుట్టాడు. జనవరి 2, 2026'' అని ఆది...