Telangana,hyderabad, ఆగస్టు 10 -- ఆదివాసీ వర్గాలకు డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ శుభవార్తను చెప్పింది. ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులను పట్టభద్రులను చేయాలన్న లక్ష్యంతో సరికొత్త నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్యను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఓ ప్రకటన విడుదల చేశారు.

"డా. బీ. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గడిచిన నాలుగు దశాబ్దాల్లో చదువుకు దూరమైన లక్షలాది మందికి ఉన్నత విద్య అవకాశాలు చేరువ చేసింది. కొత్త జీవితావకాశాలు అందించింది. ఈ లక్షలాది మందిలో ఎవరున్నారు అని కాకుండా ఎవరు లేరు అని ఆలోచిస్తే, కొన్నివర్గాలు తెగలు ఇంకా చదువుకు దూరంగా ఉన్నారనేది అర్థమయ్యింది. అందులో ముఖ్యంగా ఆదివాసీ తెగలు ఉన్నత విద్యలో అత్యంత వెనుకబడి ఉన...