భారతదేశం, జూన్ 22 -- తెలంగాణ చరిత్ర పరిశోధనల్లో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిలాబాద్ జిల్లా భీమ్సరి గ్రామంలో అత్యంత అరుదైన, చారిత్రక 'బుద్ధ పరినిర్వాణ' (మహా పరినిర్వాణం చెందుతూ పడుకుని ఉన్న బుద్ధుడు) శిల్పం లభ్యమైంది. 'కొత్త తెలంగాణ చరిత్ర బృందం' సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, చరిత్ర అధ్యాపకుడు పృథ్విరాజ్ భీమ్సరి గ్రామంలో క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తుండగా ఒక రాతి స్తంభంపై ఈ శిల్పాన్ని గుర్తించారు. ఈ స్తంభానికి నాలుగు వైపులా విభిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అందులో ఒకవైపు బుద్ధ పరినిర్వాణ శిల్పం అర్ధ శిల్పంగా మలచబడి ఉంది.

ఈ శిల్పాన్ని నిశితంగా పరిశీలించిన చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ... "ఈ శిల్పంలో బుద్ధుడు తన కుడిచేతిని తల కింద ఉంచుకుని, కుడివైపునకు తిర...