భారతదేశం, జూన్ 18 -- పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ 15 నాటికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి సిద్ధం కావాలి. పాత, కొత్త పన్ను విధానాలలో దేనినైనా ఎంచుకుని.. ఫారమ్ 16, 26ఏఎస్ వంటి పత్రాలను చెక్ చేసుకోవాలి. పెట్టుబడులు, హెచ్ఆర్ఏ మినహాయింపు, ఇంటి ఆస్తి ఆదాయంలాంటివన్ని చూసుకోవాలి. ప్రస్తుతం, ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. పాత, కొత్త పద్ధతుల మధ్య ఎంచుకోవచ్చు. ఈ కింది 7 విషయాలను తప్పకుండా చుసుకోవాలి.

పన్ను చెల్లింపుదారులు వారి పెట్టుబడి చరిత్ర, ఆదాయ స్థాయి ఆధారంగా పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే.. పనిచేస్తున్న కంపెనీకి ముందుగానే తెలియజేయాలి. కొత్త పన్ను విధానంలో అలాంటి అవసరం లేదు.

నెలవారీ జీతం పొందే పన్ను చెల్లింపుదారుడు తమ కంపెనీ నుండి పొందవలసిన పత్రం ఫార...