భారతదేశం, మే 15 -- ఏపీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చే కీలక శాఖల పనితీరుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,27,506 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. ఆ దిశగా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రం సొంతంగా ఆర్జించే ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ఆదాయ మార్గాల శాఖలు కసరత్తు ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.27 లక్షల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గత రెండేళ్లలో రాష్ట్ర సొంత ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024-25: రూ. 1,04,345 కోట్లు, 2025-26: రూ. 1,10,643 కోట్లు (6 శాతం వృ...