భారతదేశం, జూలై 22 -- ఆడుదాం ఆంధ్రా క్రీడా కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్ నివేదిక ఆగస్టు మొదటి వారం నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అట్టడుగు స్థాయి క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అవినీతి, నాణ్యత లేని సరఫరాలు, ప్రజా నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి.

ఈ కార్యక్రమం డిసెంబర్ 15, 2023, ఫిబ్రవరి 3, 2024 మధ్య నిర్వహించారు. వార్డు నుండి రాష్ట్ర స్థాయి వరకు యువతను క్రీడా పోటీల ద్వారా నిమగ్నం చేయడానికి రూపొందించారు. ఇది అందరి దృష్టిని ఆకర్శించింది. ఆటగాళ్ళు, అసోసియేషన్ సభ్యుల నుండి ఫిర్యాదులు వెలువడటం ప్రారంభించడంతో వివాదం మెుదలైంది. నాణ్యత లేని కొనుగోళ్లు, స్పోర్ట్స్ కిట్‌లను సక్రమంగా పంపిణీ చేయకపోవడం వంటి ఆరోప...