Andhrapradesh, ఆగస్టు 17 -- అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. జూనియర్ ఎన్టీఆర్ ను కించపరిచేలా ఆడియో కాల్ మాట్లాడటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ కాగా. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్యాలయం వద్ద అభిమానులు ధర్నా చేపట్టారు.

ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయంలో లేరని కార్యాలయ సిబ్బంది ఆందోళనకారులకు సమాచారం ఇచ్చారు. దీనిని పట్టించుకోని అభిమానులు కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

తాను బతికున్నంత కాలం టీడీపీలోనే ఉంటా...