భారతదేశం, జూన్ 5 -- ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులని అంటారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా మంచిదని కూడా చెబుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే ఆడపిల్లలను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అడుగు పెట్టిందని ఎంతగానో సంతోషిస్తారు. అయితే, నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులా? ఆడపిల్లలు పుడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టేనా? దీని గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం.

ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే, అది కేవలం జీవసంబంధమైన కారణాల వల్ల మాత్రమే కాదు. ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్యాలు కూడా దాని వెనుక దాగి ఉన్నాయని నమ్ముతారు.

శాస్త్రాలు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎందుకు అదృష్టవంతులో కూడా చెబుతున్నాయి. జ్యోతిష్యం ప్రకారం, ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో సానుకూల మార్పులు మొదలవుతాయి. తండ్రి ...