భారతదేశం, మార్చి 11 -- ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో మారుతున్న సమీకరణలు దిగ్గజ కంపెనీలను సైతం గడగడలాడిస్తున్నాయి. జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) గ్రూప్ తాజాగా ఒక కఠిన నిర్ణయాన్ని ప్రకటించింది. రాబోయే 2030 నాటికి జర్మనీలోని తన ప్లాంట్లు, కార్యాలయాల నుంచి సుమారు 50,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా కంపెనీ లాభాలు పడిపోవడమే ఈ భారీ లేఆఫ్స్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఒకప్పుడు ప్రపంచ కార్ల మార్కెట్‌ను శాసించిన ఫోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం, ఈ నిర్ణయం వెనుక మూడు బలమైన కారణాలు ఉన్నాయి:

కంపెనీ పరిస్థితిని వివరిస్తూ వాటాదారులకు రాసిన లేఖలో సీఈఓ ఆలివర్ బ్లూమ్ స్పష్టతనిచ్చారు. "ప్రస్తు...