భారతదేశం, ఆగస్టు 24 -- రవాణా శాఖ అధికారులు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిపిన చర్చల అనంతరం తెలంగాణలో సమ్మెను విరమిస్తున్నట్లు ఆటో డ్రైవర్ల యూనియన్లు ప్రకటించాయి. 14 రకాల ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పలు కీలక అంశాలపై సానుకూల హామీలు ఇవ్వడంతో సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఆటో కార్మికుల సంఘాలు లేవనెత్తిన డిమాండ్లపై ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి ప్రభాకర్ వారికి వివరించారు. సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఆటో కార్మికుల కోసం ఒక సంక్షేమ మండలిని ఏర్పాటు చేయడం అందులోని కీలక నిర్ణయాలలో ఒకటి. ఈ మండలికి సంబంధించిన విధివిధానాలను చర్చించి ఖరారు చేయడానికి సెప్టెంబర్ 1న కార్మిక శాఖ, రవాణా శాఖ, ఆటో కార్మికుల సం...