భారతదేశం, సెప్టెంబర్ 11 -- జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆచార్య చాణక్యుడి నీతులు ఎప్పుడూ దిశానిర్దేశం చేస్తుంటాయి. ఆయన చెప్పిన మార్గాలను అనుసరించడం కొంచెం కష్టంగా అనిపించినా, వాటిని ఆచరణలో పెట్టిన వారు జీవితంలో ఎన్నటికీ వెనుకడుగు వేయరు. మనిషి ఏయే సందర్భాల్లో సంకోచాన్ని వదిలి ధైర్యంగా, ముక్కుసూటిగా వ్యవహరించాలో చాణక్యుడు స్పష్టంగా వివరించారు. ఏ విషయంలో వినయంగా ఉండాలో, ఏ రంగంలో తెగింపు అవసరమో తెలుసుకోవడం ద్వారానే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఓ శ్లోకం ద్వారా చాణక్యుడు అందరికీ ఉపయోగపడే విషయాలను అద్భుతంగా వివరించారు.

డబ్బు లేదా ధాన్యానికి సంబంధించిన లావాదేవీలు, వ్యాపార వ్యవహారాలలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి అడగడంలో, వ్యాపార లెక్కలు సరిచూసుకోవడంలో, జీతాల గురించి మాట్లాడేటప్పుడు మొహమ...