భారతదేశం, జూన్ 24 -- వ్యవసాయ రంగంలో సరికొత్త నైపుణ్యాలను నేర్చుకుని, సొంతంగా ఉపాధి పొందాలనుకునే వారికి ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ANGRAU) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. విశ్వవిద్యాలయానికి చెందిన 'సెంటర్ ఆఫ్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్' (ODLC) ద్వారా పలు రకాల వ్యవసాయ ఆధారిత సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నప్పటికీ, కేవలం 30 శాతం లోపు సాంకేతికతలు మాత్రమే రైతులకు చేరుతున్నాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి, ఆధునిక సమాచార సాంకేతికత సాయంతో నేరుగా గ్రామీణ ప్రజలకు వ్యవసాయ విద్యను అందించడమే ఈ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం.

స్కూల్ డ్రాపౌట్స్ (చదువు మధ్యలో ఆపేసిన వారు), చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవ...