Andhrapradesh, ఆగస్టు 11 -- రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన 'స్త్రీ శక్తి'(మహిళకు ఉచిత బస్సు) అమలు కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే మార్గదర్శకాలను జారీ చేశారు. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లందరూ ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులను ఉపయోగించి ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. డిమాండ్ ను బట్టి అదనపు బస్సులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర కార్యకలాపాలు, కాంట్రాక్ట్ క్యారేజీలు, చార్టర్డ్ సర్వీసులు...