భారతదేశం, ఆగస్టు 22 -- ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి, ఆగస్టు 31న ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, మార్కాపురం జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా లక్షలాది మందికి తాగునీటి ఎద్దడి తీరనుంది.

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మూడో విడత పరిహారం కింద రూ.250 కోట్లను సీఎం చంద్రబాబు తన క్యాంప్ కార్యాలయంలో శనివారం అందజేశారు. 1996లో తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, 30 ఏళ్ల స్వప్నం ఇప్పుడు సాకారమవుతోందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో ఫేజ్-1 కోసం రూ.2,250 కోట్లు వెచ్చించి పనులను శరవేగంగా పూర్తి చేసినట్ల...