భారతదేశం, ఆగస్టు 1 -- భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే రూట్లలో అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా యాత్రికుల భద్రత దృష్ట్యా అమర్‌నాథ్ యాత్రను ఆగస్టు 3 వరకు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం, పహల్గామ్ మార్గం నుండి తీర్థయాత్ర నిలిపివేశారు. గుహ మందిరానికి కొత్త యాత్రికులను అనుమతించలేదని, బల్తాల్ మార్గం నుండి యాత్రను అనుమతించినట్లు వెల్లడించారు. అయితే భారీ వర్షాల కారణంగా బల్తాల్ మార్గంలో కూడా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తర్వాత ప్రకటించారు.

జమ్మూలోని బాగ్వతి నగర్ బేస్ క్యాంప్ నుంచి వరుసగా రెండో రోజు యాత్రికుల రాకపోకలను నిలిపివేశారు. వర్షాల కారణంగా ఆగస్టు 3 వరకు బల్తాల్ నుంచి యాత్ర లేదు. అధికారులు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అమర్ నాథ్ యాత్ర మార్గంలోని బల్తాల్ యాక్సిస్ లో మరమ్మతులు,...