ఆగస్టు 13 నుంచి ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస ప్రత్యేక కుంకుమార్చన సేవలు.. టికెట్ ధర ఎంత?
భారతదేశం, ఆగస్టు 12 -- శ్రావణ మాస శుభ ఘడియలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక కుంకుమార్చన సేవలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ ప్రకటించారు. పరమ పవిత్రమైన శ్రావణ మాసం మొత్తాన్ని పురస్కరించుకుని ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు ఈ ప్రత్యేక ఆర్జిత సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.
ఇంద్రకీలాద్రి పైభాగంలో ఉన్న ఆలయ పూజా మండపంలో ప్రతిరోజూ ఈ పూజలు నిర్వహిస్తారు. ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. ప్రత్యేక కుంకుమార్చన టికెట్ ధర రూ. 1,000 గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై దంపతులు లేదా ఇద్దరు భక్తులకు పూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో టికెట్లు అందుబాటులో ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.