భారతదేశం, జూలై 31 -- జ్యోతిష్య శాస్త్రంలో రాహువు సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆగస్ట్ 1న రాహువు కుజుడికి చెందిన ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల రాహువు, కుజుల కలయికతో శక్తివంతమైన ప్రభావం ఏర్పడనుంది. ఇంతకాలం తన సొంత నక్షత్రంలో సంచరించిన రాహువు, ఇప్పుడు కుజ నక్షత్రంలోకి అడుగుపెడుతుండటంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే, మరికొన్ని రాశుల వారు తీవ్ర హెచ్చరికలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది అంగారక యోగాన్ని తెచ్చిపెట్టనుంది. అసలు రాహువు అంటే ఏమిటి? ఈ నక్షత్ర మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరంగా చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలంటే ఈ రెండు గ్రహాల స్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పౌరాణిక ...