భారతదేశం, జూలై 20 -- ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) సిద్ధమైంది. విమానాశ్రయానికి మెరుగైన ప్రజా రవాణా సదుపాయం కల్పించే లక్ష్యంతో ఆగస్టు 1న 20 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు విశాఖపట్నం ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పల నాయుడు వెల్లడించారు.

ఈ పథకం ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 7 విద్యుత్ బస్సులు విశాఖ నగరానికి చేరుకోగా, మిగిలిన 13 బస్సులు జూలై 25 నాటికి రానున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఈ-బస్సులను ప్రారంభించనున్నారు.

ప్రయాణికులకు స...