భారతదేశం, జూలై 27 -- కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యుడికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు.

బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52లకు, గ్రేడ్ 1 రా రైస్ రూ.50లకు రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. సామాన్యుడిపై ధరల భారం పడకుండా కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం స్వాగతించదగినదని చెప్పారు.

'బహిరం...