భారతదేశం, జూలై 21 -- తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ జ్యోతిష్యానికి, గ్రహాల గమనానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఏ చిన్న గ్రహం మారాడానికైనా మన జీవితాలపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. త్వరలో ప్రారంభం కానున్న ఆగస్టు నెలలో మొదటి రోజే ఒక కీలక గ్రహ మార్పు జరగబోతోంది. భౌతిక సుఖాలు, ప్రేమ, ఐశ్వర్యం, వైభవానికి కారకుడైన శుక్రుడు తన రాశిని మారుస్తున్నాడు.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆగస్టు 1, 2026 ఉదయం 9:33 గంటలకు శుక్రుడు సింహరాశిని వీడి కన్యారాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ శుక్ర గోచారం ప్రభావం ద్వంద్వ రాశులపై పడినప్పటికీ, ముఖ్యంగా ఐదు రాశుల వారికి మాత్రం ఇది జాక్‌పాట్ లాంటి సమయంగా నిపుణులు చెబుతున్నారు. కెరీర్, వ్యాపారం, ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా మారే అవకాశం ఉంది. ఆ అదృష్ట రాశుల విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

వృషభ రాశికి శుక్రాచార్యుడే అధిపతి. అ...