భారతదేశం, జూన్ 28 -- ఈ ఆగస్టు నెలలో గల్ఫ్ దేశాల(UAE) నుండి భారతదేశానికి ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు విమాన చార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడ వేసవి సెలవుల డిమాండ్ కారణంగా యూఏఈ ప్రయాణికులకు భారతదేశంలోనే అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచింది. ఇక్కడికి రిటర్న్ ఎయిర్‌ఫేర్ (రానుపోను టికెట్ ధర) ఏకంగా 9,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీలో రూ. 2,31,000 పైమాటే) దాటేసింది. ముంబై విమాన టికెట్ ధరలతో పోలిస్తే హైదరాబాద్ ఛార్జీలు దాదాపు 6 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆగస్టు 1 నుండి 31 మధ్య ప్రయాణాల కోసం ఎమిరేట్స్, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్‌లో టికెట్ ధరలను విశ్లేషించగా ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో అత్యధికంగా 9,250 దిర్హామ్‌లు (రూ. 2,37,667) రానుపోను విమాన ఛార్జీ నమో...