భారతదేశం, జూలై 2 -- కరోనా వ్యాక్సిన్ గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్వహించిన లోతైన అధ్యయనం ఆధారంగా మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది నడక, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ గుండెపోటుతో మరణించిన సంఘటనలు కనిపించాయి.

ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి షాకింగ్ వీడియోలు బయటకు రావడంతో ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్లపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) అధ్యయనాల్లో భారత్లో కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవని తేలిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన దుష్ప్...