భారతదేశం, జూలై 24 -- జులై 24 రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం(AU) కీలక నిర్ణయం తీసుకుంది. సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (CDOE) ద్వారా నిర్వహించాల్సిన పలు దూరవిద్య పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ వర్గాలు అధికారిక సమాచారాన్ని విడుదల చేశాయి.

జులై 24 (శుక్రవారం) నాడు జరగాల్సిన అన్ని దూరవిద్య పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు దూరవిద్య కేంద్రం (CDOE) డైరెక్టర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జులై 24 (శుక్రవారం) నుంచి జరగాల్సిన పరీక్షలు.. పునఃప్రారంభమయ్యే సవరించిన తేదీ ఆగస్టు 4 (మంగళవారం)గా ఉంది.

మిగిలిన పరీక్షలు మాత్రం ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగుతాయి. విద్యార్థులు మార్చిన తేదీలను గమనించి, దానికి అనుగుణంగా ప్రయాణ, పరీక్షల ఏర్పాట్లు చేస...