భారతదేశం, జూన్ 13 -- ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో ప్రముఖ విద్యాసంస్థ అయిన విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (AU) నిరుద్యోగ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను వర్సిటీ పరిధిలోని వివిధ అనుబంధ కళాశాలలు, పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నియామకాలు పూర్తిగా సెమిస్టర్ ప్రాతిపదికన ఉంటాయి. యూనివర్సిటీలోని వివిధ అకడమిక్ విభాగాల్లో బోధనా పనులను నిర్వహించడానికి ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని క్రింది ప్రముఖ కళాశాలల్లో ఈ తాత్కాలిక అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు:

ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్

ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

ఏయూ కా...