భారతదేశం, డిసెంబర్ 14 -- ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' థియేట్రికల్ రన్ ముగించుకుని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. నవంబర్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 25న అంటే క్రిస్మస్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి మరో నిరాశనే మిగిల్చిన మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా వెనుకబడిపోయింది. దీంతో నెల రోజుల్లోపే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.