ఆంధ్రాలో పాక్ గూఢచర్య నెట్వర్క్.. ఇక్కడ నుంచి రక్షణ సమాచారం లీక్!
భారతదేశం, అక్టోబర్ 6 -- దేశ భద్రతకే సవాలుగా మారిన పాకిస్థాన్ గూఢచర్య నెట్వర్క్ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం బట్టబయలు చేసింది. ఆపరేషన్ ఫైర్వాల్-2026 పేరుతో చేపట్టిన ఈ భారీ డ్రైవ్లో పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఏపీ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
భారత నావికాదళానికి చెందిన సున్నితమైన రక్షణ సమాచారాన్ని శత్రుదేశానికి చేరవేస్తున్నారనే పక్కా సమాచారంతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్కు చెందిన 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 18 మందిని అనుమానితులుగా గుర్తించగా, వారిలో 13 మంది భారత నావికాదళానికి చెందిన సిబ్బంది కావడం గమనార్హం.
తమిళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.