భారతదేశం, నవంబర్ 19 -- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రాజకీయాల్లో సందడి మరింత పెరిగింది. రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇప్పటికే ఈ నెల 13న తొలి విడత, 16న రెండో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, తాజా నోటిఫికేషన్‌తో మూడో దశ పోరుకు రంగం సిద్ధమైంది.

ఈ మూడో విడతలో రాష్ట్రంలోని పలు జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.

నవంబర్ 21ఫారమ్-1లో ఎన్నికల నోటీసు జారీ, వార్డు వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారు. నవంబర్ 21 నుం...