భారతదేశం, అక్టోబర్ 21 -- ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నడుమ అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ఎస్ఈసీ ప్రకటించింది. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని పల్నాడు, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల ఘట్టం రణరంగాన్ని తలపించడం, ఘర్షణలు చోటుచేసుకోవడంతో మెుదట 19 స్థానిక సంస్థల ఎన్నికలపై అనిశ్చితి నెలకొంది. ఈ 19 పురపాలికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇచ్చే సమగ్ర క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్‌ఈసీ ...