భారతదేశం, మార్చి 11 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నెం.06571 యశ్వంత్‌పూర్-కతిహార్ స్పెషల్ మార్చి 10, 17, 24, 31 (మంగళవారాలు) తేదీల్లో ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 5 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఉదయం 5.10 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 4.30 గంటలకు కతిహార్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో, రైలు నెం. 06572 కతిహార్-యశ్వంత్‌పూర్ స్పెషల్ మార్చి 13, 20, 27, ఏప్రిల్ 3 (శుక్రవారాలు) తేదీలలో ఉదయం 5.15 గంటలకు కతిహార్ నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున 3.40 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్...