భారతదేశం, జూలై 23 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ అయిన మిషన్ శక్తి శాట్(Mission Shakti SAT) కు తూర్పుగోదావరి జిల్లా దవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక ఏపీ బాలికగా జెస్సీ చరిత్ర సృష్టించింది.

ఈ గ్లోబల్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి దాదాపు 12,000 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా, పలు విడతల కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల తుది జాబితాలో 14 ఏళ్ల జెస్సీ తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.

జెస్సీ తండ్రి వృత్తిరీత్యా కార్పెంటర్‌గా పన...