భారతదేశం, మే 9 -- ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులకు పెద్ద ఉపశమనం కలిగిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని రామవరప్పాడు, గొల్లపూడిలో రబీ వరి సేకరణ కార్యకలాపాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రబీ సీజన్‌లో ప్రభుత్వం దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని యోచిస్తోందని మంత్రి తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే ఊహించిన దానికంటే అధిక పంట దిగుబడుల కారణంగా, ఈ సీజన్‌లో 70 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యంలో ఇది ఒక భాగం కానుందన్నారు. 'రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు పౌర సరఫరాల శాఖ ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు...