భారతదేశం, డిసెంబర్ 30 -- ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. 2023 గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పేర్కొన్న రిజర్వేషన్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ రిజర్వేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను రద్దు చేస్తూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ అనేక మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషన్లను తిరస్కరించింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న పిటిషనర్ల వాదనలను పక్కన పెట్టింది. దీనితో గ్రూప్ 2 అభ్యర్థులకు ఉపశమనం లభించింది. ...