Andhrapradesh, ఆగస్టు 12 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. త్వరలోనే సమగ్రమైన నూతన ఫిల్మ్ పాలసీని తెస్తామని ప్రకటించారు. సోమవారం వెలగపూడి సెక్రటేరియట్ లోని రెండవ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రితో నిర్మాతలు భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలతో రూపొందించిన డాక్యుమెంట్ ని మంత్రికి అందించారు.

సినిమా పరిశ్రమ సమస్యలు, 24 విభాగాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి దుర్గేష్ ను నిర్మాతలు అభ్యర్థించారు. ఈ సందర్భంగా. సినిమా షూటింగ్ లు, కొత్త సినిమా విడుదల, నూతన ఫిల్మ్ పాలసీ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో సీఎం, డిప్యూటీ సీఎంలతో సమావేశ...