భారతదేశం, జూలై 14 -- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకు ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను సవరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారికి జులై 14, 2026 నాటి లేఖ ద్వారా అధికారిక ఆదేశాలను పంపింది.

01.07.2026 నాటికి అర్హత కలిగిన కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పుల కోసం ఈ ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో మారిన తాజా సవరించిన షెడ్యూల్ వివరాలు చూడండి. నిజానికి జులై 14తో తేదీ ముగియాల్సి ఉంది. మరో 10 రోజులు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సవరించిన ముఖ్య...