ఆంధ్రప్రదేశ్లో 5 వేలకుపైగా ఆలయాలు నిర్మిస్తాం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
భారతదేశం, అక్టోబర్ 12 -- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీవాణి ట్రస్ట్ నిధుల భాగస్వామ్యంతో ఏకంగా 5,500 నూతన దేవాలయాలను నిర్మించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పరిరక్షణతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ భక్తి భావనను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాక్షేమం, ధర్మ ప్రచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాల్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.