భారతదేశం, సెప్టెంబర్ 25 -- కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గురువారం సాయంత్రానికి బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి మిగులు నీటిని విడిచిపెడుతున్నారు. రాత్రి 9 గంటల సమయానికి బ్యారేజీకి 26,024 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, అధికారులు 20 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 14,500 క్యూసెక్కుల అదనపు నీటిని దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.

అధికారులు కేఈ ప్రధాన కాలువలోకి 5,738 క్యూసెక్కులు, కేడబ్ల్యూ ప్రధాన కాలువలోకి 5,527 క్యూసెక్కులు, గుంటూరు కాలువలోకి సుమారు 259 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ మూడు కాలువలలో కలిపి మొత్తం 11,524 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఇతర ప్రధాన జలాశయాలలకు కూడా నీరు వస్తోంది. కృష్ణా, గోదావ...