భారతదేశం, ఏప్రిల్ 11 -- ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరించింది. తీవ్రమైన వేడి, వడగాలులు, అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తీవ్రమైన వేడి, వేడి గాలులు, తేమతో కూడిన పరిస్థితుల పట్ల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కోరారు.

శుక్రవారం ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత కాకినాడ జిల్లాలోని కరప్పలో 44.1డిగ్రీలు, కడపలో 43.6డిగ్రీలుగా నమోదవ్వగా, 22 జిల్లాల్లో ఉష్ణోగ్రత 40కి పైగా నమోదైంది. శనివారం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్ల...