భారతదేశం, ఆగస్టు 26 -- అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆగస్టు 26 నుంచి 30 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.

భారీ వర్షాలు: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపులు: ఉత్తర కోస్తా, యానాం...