భారతదేశం, నవంబర్ 2 -- పరిషత్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 4, 5వ తేదీల్లో సెలవు ప్రకటించింది. నవంబర్ 5న పోలింగ్, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనున్న MPTC, ZPTC ఎన్నికల సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 4, 5 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. గురువారం పోలింగ్ ఏర్పాట్లకు కేటాయించగా, శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. పోలింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని...