భారతదేశం, జూలై 1 -- జులై నెలలో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే సూచనలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వర్షపాత అంచనాల ప్రకారం.. రాయలసీమ, తీరప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది.

దేశంలోని చాలా ప్రాంతాల మాదిరిగానే.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ నెలలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఉష్ణోగ్రతల్లో ఎంతమేర వ్యత్యాసం ఉంటుందనే దానిపై వాతావరణ నిపుణులు ఇంకా స్పష్టమైన అంచనాను వెల్లడించలేదు.

'కొన్ని రోజులు సాధారణం కంటే ఎక్కువ వేడిగానూ, మరికొన్ని రోజులు సాధారణం కంటే చల్లగానూ ఉండ...