భారతదేశం, ఏప్రిల్ 29 -- రోగాల ముంద‌స్తు నివార‌ణ చ‌ర్యలకు ప్రాధాన్యత‌నిస్తూ వ్యక్తుల ప్రస్తుత ఆరోగ్య ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు స‌మ‌గ్ర వైద్య ప‌రీక్షలు చేప‌డ‌తామ‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమ‌లు దిశ‌గా వైద్యారోగ్య శాఖ ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. 104 సంచార వైద్య వాహ‌నాల (MMUs) ద్వారా సాలీనా రూ.162.72 కోట్ల వ్యయంతో గుర్తించిన ప్రతి వ్యక్తికీ 47 ర‌కాల వైద్య ప‌రీక్షలు చేప‌ట్టే ప‌థకానికి వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఆమోదం తెలిపారు. ఎన్‌సీడీ స‌ర్వేలో వివిధ జ‌బ్బుల‌పాలైన లేదా అవ‌కాశ‌మున్న వారిగా గుర్తించిన వారితో పాటు సంక్షేమ విద్యా వ‌స‌తి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల‌తో క‌లిపి ఏడాదికి 56 ల‌క్షల 40 వేల మందికి ఒక్కొక్కరికీ 47 ర‌కాల ప‌రీక్షలు చేస్తారు.

జ‌బ్బుల‌కు గురైన వారికి చికిత్స అందిస్తున్న ప్రస్తుత వి...