భారతదేశం, నవంబర్ 2 -- అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై వచ్చే ఫ్రీహోల్డ్ దరఖాస్తుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ భూములకు సంబంధించిన ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తూ పరిపాలనాపరమైన స్పష్టమైన నిబంధనలతో కూడిన జీవో 659ను జారీ చేసింది. భూ యజమానులకు వేగంగా యాజమాన్య హక్కులు కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ద్వారా కచ్చితమైన కాలపరిమితులను నిర్దేశించింది.

సాధారణ ప్రజలు, రైతులు తమ భూముల ఫ్రీహోల్డ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ యంత్రాంగానికి గడువు విధించారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీవో పరిధిలో గరిష్టంగా 60 రోజుల్లోగా...