భారతదేశం, ఆగస్టు 25 -- హైదరాబాద్: దేశ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 25 ఏళ్లుగా ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన సూచించారు. 21 ఏళ్ల వయస్సులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా దేశానికి సేవలందించే అవకాశం ఉన్నప్పుడు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు.

ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన హాస్టళ్లను ప్రారంభించి, పలు భవనాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 21 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆ వయస్సును 18 ఏళ్లకు తగ్గించారు. ఇప్పుడు 21 ఏళ్ల యువకులు ఐఏఎస్, ఐపీఎస్ అధికార...