Andhrapradesh, సెప్టెంబర్ 25 -- ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ సభలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మాజీ సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. సైకో అంటూ సంబోధిస్తూ నోరు జారారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

ఇవాళ ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రావు మాట్లాడారూ. ఈ సందర్భంగా సినిమా రంగం గురించి పలు అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో సినిమా రంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. సినిమా సెలబ్రిటీలు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లిన సమయంలో కూడా అవమానించారని చెప్పుకొచ్చారు. సినీ హీరోలతో మాట్లాడేందుకు నాటి సీఎం జగన్ ఆసక్తి చూపించలేదన్నారు. ఏమైనా సమస్యలుంటే సినిమాటో గ్రఫీ మంత్రితో మాట్లాడాలని అన్నారని శ్రీనివాస్ రావు గుర్త...