భారతదేశం, అక్టోబర్ 5 -- 118 అసిస్సెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు టీఎస్ఎల్‌పీఆర్బీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది. అయితే తాజాగా ఈ చివరి తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వరుసగా సెలవులు రావడం, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తులను పొడిగించారు. అక్టోబర్ 11వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తులను (సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయడంతో పాటు) త్వరగా పూరించడం, సమర్పించడం వేగవంతం చేయాలని టీఎస్ఎల్‌పీఆర్బీ సూచించింది. పొడిగించిన గడువుకు ముందుగానే దరఖాస్తులు సమర్పిస్తే చివరి నిమిషంలో సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొంది.

తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి దరఖాస్తులు మెుదలైన విషయం...